ప‌నీ పాటా లేదా?: సుప్రీం చీవాట్లు

Supreme Court Chief Justice slams case against Priya Varrier
Friday, August 31, 2018 - 15:45

ప్రియా వారియ‌ర్ గుర్తుందా? కొన్ని నెల‌ల క్రితం ఈ కేర‌ళ కుట్టి పేరు దేశ‌మంతా మార్మోగింది. ఒక మ‌ల‌యాళ సినిమాకి సంబంధించిన పాట‌లో హీరోకి క‌న్నుగీటిన ఒక సీన్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఓవ‌ర్‌నైట్ ఆమె గురించి దేశ‌మంతా మాట్లాడుకొంది. నాలుగు నెల‌ల త‌ర్వాత అంద‌రూ ఆమె గురించి మర్చిపోయారు. ఆ సినిమా ఏమైందో కూడా ఎవ‌రికీ తెలియ‌దు.

ఐతే ఆ సినిమాలోని ఆ పాట‌పై తెలంగాణ‌కి చెందిన కొంద‌రు యువకులు కేసు వేశారు. ఆ కేసు ఇపుడు విచార‌ణ‌కి వ‌చ్చింది. ఆ కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సినిమాలో ఏదో పాట పాడితే.. మీకు కేసు వేయడం తప్ప మరో పనేం లేదా? అని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పిటీష‌న్ వేసిన వారికి అంక్షింత‌లు అంటించారు.

మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి అంటూ ప్ర‌తివాళ్లూ సినిమాల‌పై కేసు వేస్తున్న వారికి సుప్రీం తీర్పు ఒక చెంప‌పెట్ట‌. ప‌నీపాటా లేకుండా సినిమాల‌పై కేసులు వేయ‌డం ఏంట‌ని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా గ‌ట్టిగానే తిట్టారు.