కె.విశ్వనాథ్‌ ని కలిసిన సీఎం కేసీఆర్

Telangana CM KCR calls on K Vishwanath
Sunday, August 11, 2019 - 19:15

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలవడం ఒక సర్ప్రైజ్. ఇది మర్యాదపూర్వక కలయిక మాత్రమే. కె.విశ్వనాథ్‌ సినిమాలకి సీఎం కేసీఆర్‌ అభిమాని. ఒక అభిమానిగా తనను కలవడానికి వచ్చాను అని కేసీఆర్‌ చెప్పారని విశ్వనాధ్ మీడియాకి వివరించారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని విశ్వనాధ్ ఇంటికి ఆదివారం కేసీఆర్‌ వెళ్లారు.

తనకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇప్పుడు ఎలా ఉందని వాకబు చేసేందుకే సీఎం వెళ్లారన్న వార్తలను విశ్వనాధ్ తోసిపుచ్చారు. తాను పెర్ఫెక్టు హెల్తీ అన్నారు విశ్వనాధ్. 

అజ్ఞాత అభిమానిని అంటూ కేసీఆర్‌ పేర్కొన్నారట. "కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా ఉంది. ఆయనకి తెలుగు లిటరేచర్ లో చాలా పట్టు ఉంది. సాహిత్య అంశాలపై చాలా మాట్లాడుకున్నాం. ఆయన జ్ఞానం దగ్గరిగా చూసి ఆశ్చర్యం పోయాను. కేవలం ఒక అభిమానిగానే కలవాలని వచ్చాను అనడం ఏంటో గర్వంగా అనిపించింది, " అని కె.విశ్వనాధ్ అని చెప్పారు.