డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్ వీళ్లే

Tollywood stars in the drugs case
Thursday, July 13, 2017 - 13:30

తెలంగాణ ఎక్సైజ్ శాఖ క‌మీష‌న‌ర్ అకున్ స‌భ‌ర్వాల్ తాజాగా మ‌రో మేట‌ర్ చెప్పారు. డ్ర‌గ్స్ కేసుకి సంబంధించి టాలీవుడ్‌లో మొత్తం 16 మందికి నోటీసులు జారీ చేశామ‌ని చెప్పారు. అందులో ఇద్ద‌రు బ్యాంకాక్‌కి పారిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తే నిలిపివేశామ‌ని ప్ర‌క‌టించారు.

టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ ఇష్యూ చాలా సీరియ‌స్ అని నిన్న చిత్ర‌సీమ పెద్ద‌లు వ‌చ్చి ప్రెస్‌మీట్ పెట్ట‌డంతోనే అర్థ‌మైంది. ఈ రోజు అకున్ స‌భ‌ర్వాల్ మ‌రింత క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయ‌న కానీ, ప్ర‌భుత్వ యంత్రాంగం కానీ ఇంత‌వ‌ర‌కు పేర్ల‌ను బ‌య‌ట‌పెట్ట‌లేదు. నోటీసులు జారీచేసిన వారంతా వ్య‌క్తిగ‌తంగా పోలీసుల వ‌ద్ద‌కి వ‌చ్చి స‌మాధానం ఇవ్వాలి. అపుడు అస‌లు పేర్లు బ‌య‌టికి రావొచ్చు. ప్ర‌స్తుతానికి ప‌లు పేర్లు మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 

ఎన్టీవీ న్యూస్ చానెల్ ప్ర‌కారం.. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు, ఇద్ద‌రు హీరోలు, ఒక ఐటెంగాల్ ఈ లిస్ట్‌లో ఉన్నార‌ట‌. 

1. చాలా స్పీడ్‌గా సినిమాలు తీసే ఒక ద‌ర్శ‌కుడు
2. ఇద్ద‌రు ప్ర‌ముఖ నిర్మాత‌లు
3. ఒక‌పుడు వెలుగు వెలిగి ఇపుడు అవ‌కాశాలు లేని హీరో
4. అంద‌మైన గాయ‌ని భ‌ర్త‌
5. ఒక‌పుడు టాప్ హీరో అవుతాడేమో అని అంద‌రూ భావించిన యువ హీరో (ప్ర‌స్తుతం అవ‌కాశల్లేవు)
6. ప్ర‌ముఖ హీరోల కుమారులు కూడా బాధితులేన‌ట‌

హీరోగా విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రస్తుతం చేతుల్లో సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉన్న ఓ యువనటుడికి డ్రగ్స్ దందాలో ప్రధాన పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇతనితో పాటు ఓ వర్ధమాన గాయకురాలి భర్తకు, సినిమా ఫంక్షన్లు జరిగితే, హీరోలను ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలు గుప్పిస్తుండే ఓ నిర్మాత,  సినిమాల్లో తొలుత హీరోగా ప్రవేశించి, ఆపై సరైన బ్రేక్ లు రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ యువ నటుడు ఉన్నారు. నోటీసులు అందుకున్న హీరోయిన్లలో... అటు టీవీ తెరపై, ఇటు వెండి తెరపై రాణిస్తున్న ఓ నటి, అటు సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు స్టేజ్ షోలు, న్యూ ఇయర్ పార్టీల్లో సందడి చేస్తుండే నటి, డైరెక్టర్లతో క్లోజ్ గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలను కూడా చూసే ఓ హీరోయిన్ ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

నిన్న అల్లు అర‌వింద్‌, సురేష్‌బాబు త‌దిత‌రులు మీడియా ముందుకొచ్చి టాలీవుడ్ డ్ర‌గ్స్ వాడ‌కందారుల‌పై విరుచుకుప‌డ్డారు. పరిశ్రమలో పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకాన్ని అరికట్టాలని పిలుపునిస్తూనే.. ఓ 10 మందిని ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీచేశారు నిర్మాత అల్లు అరవింద్. నంబర్ నాకు తెలీదు కానీ, ఓ 10 లేదా 15 మంది పరిశ్రమకు చెందిన వ్యక్తుల పేర్లు పోలీసుల వద్ద ఉన్నాయి. పూర్తిగా ప్రభుత్వం  వాళ్లను ట్రాక్ చేస్తోంది. ఇప్పటికైనా ఈ డ్రగ్స్ తీసుకోవడం ఆపకపోతే వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు చేస్తున్న పనుల వల్ల ఫిలిం ఇండస్ట్రీకి ఎంత చెడ్డపేరు వస్తుందో ఓసారి ఆలోచించండి. మీ కుటుంబానికి మీరు ఏం చెబుతారు. రేవ్ పార్టీల కల్చర్ బాంబే నుంచి మనకు కూడా వచ్చింది. మీకు హెచ్చరిక ఏంటంటే.. మీరంత కళ్లు మూసుకొని పాలు తాగుతున్నామని అనుకుంటున్నారు. ప్రతి యాంగిల్ లో మీరు ట్రాకింగ్ లో ఉన్నారు. ప్రభుత్వం దగ్గర మీకు చెందిన సమాచారం మొత్తం ఉంది. మీ జీవితాలు నాశనం అయిపోతాయి. జాగ్రత్త. 

టాలీవుడ్ లో కలకలం ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే ఈ మేటర్ నివురుగప్పిన నిప్పే.