పైరసీదారులపై డీజే గరం

అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కలెక్షన్లు అదుర్స్ అన్న రీతిలో సాగుతున్నాయి. మొదటి నాలుగు రోజులు కలెక్షన్ల పరంగా తెలుగునాట దుమ్మురేపింది డీజే. అయితే తాజాగా ఈ సినిమాకి పైరసీ బెడద మొదలైంది.
డీజే సినిమా హై క్వాలిటీ ప్రింట్‌ని కొందరు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ లింక్‌లను మరికొందరు ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. దాంతో వెంటనే రంగంలోకి దిగింది డీజే టీమ్. పైరసీ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీష్ శంకర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్రాన్ని పైరసీ చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇప్పటికే పోలీసులు వారి భరతం పట్టడం మొదలుపెట్టారు.
మరోవైపు, అల్లు అర్జున్ ఈ వీకెండ్ అమెరికా వెళ్తున్నాడు. సినిమాని అక్కడ ప్రచారం చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు మిలియన్ డాలర్లకి చేరుకున్నాయి.
- Log in to post comments