అదే చెట్టు: దిల్ రాజు, వినాయక్

The special bond between Vinayak and Dil Raju
Tuesday, June 6, 2017 - 16:30

అదే చెట్టు..... అనుభూతులు పంచుకున్న 

వేదిక.. ప్రసాద్ ల్యాబ్స్

సందర్భం.. డీజే ట్రయిలర్ లాంచ్

ఆహుతులు.. దిల్ రాజుతో పనిచేసిన దర్శకులు

ఇలా ఒక్కసారిగా ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణం కళకళలాడింది. ఇంతమంది దర్శకులు ఒకే వేదికపై కలవడం నిజంగా గొప్ప విషయం. ఇలా అందర్నీ ఒక్కసారి చూడ్డంతో నిర్మాత దిల్ రాజుకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. ప్రతి దర్శకుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు దిల్ రాజు. మరీ ముఖ్యంగా దర్శకుడు వీవీ వినాయక్ తో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు ఈ నిర్మాత.

ఆది సినిమా ప్రసాద్ ల్యాబ్స్ లో ఎడిటింగ్ జరుగుతున్న టైమ్ లో అనుకోని విధంగా అక్కడే ఉన్నాడు దిల్ రాజు. అప్పటికే డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరుతెచ్చుకున్న దిల్ రాజు, నిర్మాతగా మారాలనుకుంటున్నాడు. అదే టైమ్ లో వినాయక్ తీసిన ఆది సినిమాలో సుమోలు గాల్లో లేచే సీన్ చూశాడు దిల్ రాజు. ఆ ఒక్క సీన్ చూసి వినాయక్ ను తన మొదటి సినిమాకు దర్శకుడిగా తీసుకున్నాడు. ప్రసాద్ ల్యాబ్స్ లోనే అక్కడే ఉన్న చెట్టు కింద వినాయక్ కు అడ్వాన్స్ ఇచ్చాడు. అదే విషయాన్ని దిల్ రాజు చెప్పడంతో ఆ చెట్టు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

నిర్మాతగా దిల్ రాజుకు అదే మొదటి సినిమా అయితే, వినాయక్ అందుకున్న సెకెండ్ అడ్వాన్స్ అది. ఈవెంట్ అయిన తర్వాత దిల్ రాజు, వినాయక్ తో పాటు మిగతా దర్శకులంతా ఆ చెట్టు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.